NewsWaves.news

ప్ర‌తీకారం తీర్చుకుంటాం : పాక్‌

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ నిర్వ‌హించిన మెరుపుదాడిని పాకిస్థాన్ త‌ట్టుకోలేక‌పోతోంది. ఉద‌య‌మే సెక్యూరిటీ మీటింగ్ పెట్టుకున్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మ‌హ్మ‌ద్ ఈ దాడి విష‌యంలో స్పందించారు. భార‌త వైమానిక దాడుల ను ధృవీక‌రించిన మ‌హ్మ‌ద్‌…. ‘ భారత్‌ ఇలాంటి పని చేస్తుందని మేము ప్రపంచానికి చెబుతూనే ఉన్నాం. మా మాటలను ఈరోజు భారత్‌ నిజం చేసి చూపించింది. ఇప్పుడు వాళ్లకు సరైన సమాధానం చెప్పే హక్కు ల‌భించింది. వాస్తవాధీన రేఖను దాటి భారత్‌ నిబంధనలు ఉల్లంఘించింది. ఆత్మరక్షణ హక్కు మాకు కూడా ఉంది’ కదా అని ఖురేషీ కామెంట్ చేశారు.

Related Articles