NewsWaves.news

పాక్ బుద్ధే అంత : సౌదీ రాజుకు బంగారు తుపాకి బ‌హుమతి

ఇంటికి వచ్చిన చుట్టానికి పువ్వులు లేదా ఫలాలు ఇస్తాం..మ‌రీ బాగా డ‌బ్బు ఉంటే రిట‌ర్న్ గిఫ్టుగా లాఫింగ్ బుద్దా ఇచ్చి పంపుతాం. మ‌న దేశానికి విదేశాల నుంచి వ‌స్తే మాత్రం శాలువ క‌ప్పి పూల దండ వేస్తాం. కానీ పొరుగు దేశం పాకిస్తాన్ మాత్రం అలా కాదు. త‌న బుద్ధి ఎలాంటిదో అలాంటి గిఫ్టే ఇస్తుంది.

ఇటీవ‌లే పాకిస్తాన్‌కు అధికారిక ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సౌదీ అరేబియా రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌కు పాక్ ఇచ్చిన గిఫ్ట్ ప్ర‌పంచానికి పాక్ స్వ‌భావం ఏంటో తెలిపింది. సౌదీ రాజుకు పాక్ పార్ల‌మెంట్ స‌భ్యులు ఒక తుపాకీని గిఫ్ట్‌గా ఇచ్చారు. బంగారు పూత‌తో త‌యారైన ఈ గ‌న్నును జ‌ర్మ‌నీలో త‌యారు చేశార‌ట‌.

ఈ విష‌యం తెలియ‌డంతో సోష‌ల్ మీడియాలో పాకిస్తాన్‌పై ఇప్పుడు ట్రోలింగ్ ప్రారంభ‌మైంది. పాక్ బుద్ధే అంతా అంటూ విమ‌ర్శిస్తున్నారు నెటిజెన్స్‌

Related Articles