NewsWaves.news

పాకిస్తానీ న‌టులపై బ్యాన్‌

పుల్వామా ఉగ్రదాడి త‌ర్వాత‌ పాకిస్తాన్‌కు షాకుల మీద షాకులిస్తోంది భార‌త్. అత్యంత అనుకూల దేశంగా పాకిస్తాన్‌కు మద్ద‌తు వెన‌క్కు తీసుకున్న భార‌త్‌… పాకిస్తాన్ నుంచి వ‌చ్చే ప్ర‌తీ వ‌స్తువుపై 200 శాతం ప‌న్ను విధిచింది. ఇలా ఎన్నో విధాలుగా భార‌త్ పాకిస్తాన్‌కు చుక్క‌లు చూపిస్తోంది. తాజాగా అఖిల భార‌త సినీ కార్మికుల సంఘం, పాకిసానీ న‌టీన‌టులు, క‌ళాకారులను బ్యాన్ చేసింది.

మ‌న‌దేశంలో నిర్మించే, ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఏ మూవీలోనూ పాకిస్తాన్‌కు చెందిన న‌టీన‌టులు ఉండ‌రాద‌ని.. అలా కాకుండా పాకిస్తాన్‌కు చెందిన న‌టీన‌టుల‌తో క‌లిసి న‌టిస్తే వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటాం అని హెచ్చ‌రించింది. దేశ‌మే ప్ర‌ధానం. మిగితా విష‌యాలు త‌ర్వాత అని స్ప‌ష్టం చేసింది.

Related Articles