NewsWaves.news

బ్రేకింగ్ : భార‌తీయ గ‌గ‌న‌తలంలో ప్ర‌వేశించి బాంబులు విసిరిన‌ పాక్ జెట్స్‌… బాంబుల‌తో దాడి

భార‌తీయ వాయుసేన నిర్వ‌హించిన ఎయిర్ స్ట్రైక్ కు ప్ర‌తీకారంగా పాక్ రంగంలోకి దిగింది. భార‌తీయ గ‌గ‌న‌తలంలోకి ప్ర‌వేశించిన పాక్ జెట్స్ బాంబులు కురిపించాయి. బుధ‌వారం ఉద‌యం భార‌త గ‌గ‌న‌త‌లంలో ప్ర‌వేశించిన జెట్ విమానాలు వెళ్తూ వెళ్తూ బాంబుల‌తో దాడి చేశాయి. అయితే జ‌మ్మూ కశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్ బార్డ‌ర్ నుంచి భారత్‌లోకి ప్ర‌వేశించిన ఈ జెట్స్‌ను భార‌తీయ వాయు సైన్యం తిప్పి పంపించింది. ఇండియ‌న్ ఎయిర్ క్రాఫ్ట్‌ల దెబ్బ‌కు తాళ‌లేక వెంట‌నే పాక్ జెట్స్ తోక‌ముడిచాయి. ఈ సంద‌ర్భంలో అమృత్‌స‌ర్ ఎయిర్‌పోర్టును ఖాలీ చేయించారు. ప్ర‌స్తుతం వాయుసైన్యం పూర్తిగా అప్ర‌మ‌త్తంగా ఉంది. జ‌మ్మూ, లే ల‌ఢ‌క్‌. శ్రీన‌గ‌ర్‌లో గ‌గ‌నత‌ల ప్ర‌యాణాల‌ను నిలిపేశారు

Related Articles