NewsWaves.news

డిప్యూటీ స్పీక‌ర్‌గా ప‌ద్మారావు గౌడ్

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీక‌ర్‌గా ప‌ద్మారావు గౌడ్ ఎంపిక‌య్యారు. గ‌తంలో స్పీక‌ర్‌ను ఎంచుకున్న విధానంలో ఈ పోస్టుకు కూడా ప‌ద్మారావు గౌడ్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌వ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో నిన్న తెలంగాణ రాష్ట్ర స‌మితి నేతలు కాంగ్రెస్‌, మ‌జ్లిస్‌, భాజ‌పా పార్టీల నేత‌ల‌ను క‌లిసి ప‌ద్మారావు గౌడ్‌ను పోటీలేకుండా డిప్యూటీ స్పీక‌ర్‌గా ఎంచుకునేందుకు తోడ్ప‌డాల‌ని కోరారు.

తెరాసా నేతల‌ విజ్ఞ‌ప్తికి భాజ‌పా, ఎంఐఎం నేతలు వెంటనే అంగీక‌రించగా.. కాంగ్రెస్ కొంత స‌మ‌యం కోరింది. సిఎల్‌పి స‌మావేశంలో ఈ విష‌యంపై చ‌ర్చ జ‌రిపాక చెబుతామ‌న్నారు.

Related Articles