NewsWaves.news

పుల్వామా దాడికి వినియోగించిన కార్ య‌జ‌మాని ఎవ‌రో తెలిసింది

ఈ నెల 14న పుల్వామాలో సీఆర్ఫీఎఫ్ జ‌వాన్ల‌పై దాడికి పాల్ప‌డిన జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర‌వాది…. ఆ దాడి కోసం ఒక కార్‌ను వినియోగించిన విష‌యం తెలిసిందే. అయితే కార్ ఎవ‌రిదో అనే విష‌యాన్ని జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) క‌నుక్కుంది. ఈ కార్ య‌జ‌మాని ఇటీవ‌లే ఉగ్ర‌వాద సంస్థ‌లో చేరాడ‌ని తెలిపింది.


పుల్వామా ఘ‌ట‌నపై ద‌ర్యాప్తులో ఇదో కీల‌క మలుపు అని ఎన్ఐఎ తెలిపింది. ఈ ద‌ర్యాప్తు చేసే స‌మ‌యంలో దాడిలో ముక్క‌లైన కార్ భాగాల‌ను సేక‌రించి వాటిని ప‌రిశీలించామ‌ని తెలిపారు. దాంతో య‌జ‌మాని ఎవ‌రో తెలిసింద‌న్నారు. ఈ కార్ అనంత్‌నాగ్‌కు చెందిన‌ స‌జ్జాద్ భ‌ట్‌ది అని..దాడికి కొంత కాలం క్రిత‌మే 2019 ఫిబ్ర‌వ‌రి 4న అత‌ను ఈ కార్‌ను కొనుగోలు చేసిన‌ట్టు స‌మాచారం. పుల్వామా దాడి అనంత‌రం అత‌ను ప‌రారీలో ఉన్నాడని.. అత‌ను ఉగ్ర‌వాద సంస్థ‌లో చేరాడ‌న్నారు. చేతిలో గ‌న్ను, పిస్టోల్ ఉన్న ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడ‌ని ఎన్ఐఎ తెలిపింది.

Related Articles