NewsWaves.news

వృద్ధ కీచకుడు..రెండేళ్లుగా బాలికలపై అత్యాచారాలు

రోజురోజుకి మహిళల పై బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి.రోజుకో కీచక పర్వం బయట పడుతోంది. అతడో నరరూప రాక్షసుడు! మచ్చిక చేసుకున్న బాలికలను ఇంటికి తీసుకెళ్లి వారిపై అత్యాచారాలకు ఒడిగట్టాడు. పోర్న్‌ వీడియోలు చూస్తూ మనవరాలి వయసున్న ముక్కుపచ్చలారని బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

చిత్రహింసలకు గురిచేశాడు. రెండేళ్లుగా అతడీ ఘోరాలకు పాల్పడుతున్నాడు. బాలికల్లో కొందరిని హత్యచేసివుంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వృద్ధుడు రోజూ గుడికి వస్తుంటే భార్య చనిపోయిన ఆవేదనను మరిచిపోయేందుకు అనుకున్నారు.

Vimal chand rapist

అక్కడి పేద బాలికలకు కమ్మటి భోజనం పెడుతూ, మంచి బట్టలు, డబ్బులు ఇస్తుంటే గొప్ప మనసు కలవాడని చెప్పుకొన్నారు. ఇదంతా అతడి పైపై స్వభావమే.ఆ కామపిశాచి.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ వాసి విమల్‌ చంద్‌ (63). బీమా సంస్థలో ఉన్నతోద్యోగిగా 2016లో రిటైర్‌ అయ్యాడు.

భార్య అదే సంవత్సరంలో చనిపోయింది. కూతురు విదేశాల్లో ఉంటోంది. రాజభవనం లాంటి ఇంట్లో చంద్‌ ఒక్కడే ఉంటున్నాడు. ఆ ఇంట్లోనే బాలికలపై అతడు ఘోరాలకు పాల్పడ్డాడు.చంద్‌ ఇచ్చే డబ్బులు, బట్టలకు ఆశపడి పేద కుటుంబాలకు చెందిన బాలికలు తమకు తాముగా అతడి ఇంటికొచ్చేవారు.ఈ రాక్షసకేళి ఇంట్లో బిగించుకున్న సీసీ ఫుటేజీల వల్లే బయట ప్రపంచానికి తెలిసింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి