NewsWaves.news

కేంద్రానికి బాస‌ట‌గా నిలుస్తాం … రాహుల్

కాశ్మీర్ లో ఉగ్ర‌వాదుల ఘాతుకాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. ఇటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితిలో ప్ర‌తిప‌క్షాల‌న్నీ సంఘ‌టితంగా కేంద్రానికి మ‌ద్దుతుగా నిల‌బ‌డ‌తాయ‌ని చెప్పారు. జ‌వాన్ల‌కు బాస‌ట‌గా నిలుస్తామ‌న్నారు. దేశాన్ని ముక్క‌లు చేయాల‌ని ఉగ్ర‌వాదులు భావిస్తున్నార‌ని, అది ఎప్ప‌టికీ సాధ్యం కాద‌ని రాహుల్ చెప్పారు.

ఇది ఉద్విగ్న భ‌రిత స‌మ‌య‌మ‌ని, కేంద్రానికి, భ‌ద్ర‌తా ద‌ళాల‌కు ప్ర‌తిప‌క్షాలు, యావ‌త్ దేశం మ‌ద్ద‌తుగా నిలుస్తాయ‌న్నారు. ఉగ్ర‌వాదంపై పోరులో ప్ర‌భుత్వానికి పూర్తిగా తోడ్పాటునందిస్తామ‌న్నారు. ఇదే స‌మ‌యంలో ఉగ్ర‌వాదంపై పోరులో రాజీ త‌గ‌ద‌ని మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ అభిప్రాయ‌ప‌డ్డారు.

Related Articles