NewsWaves.news

బన్నీ చెల్లెలిని నేను కానంటున్న నివేతా థామస్…

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది.ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ యాంగిల్ ఎక్కువగానే ఉంటుందని,అల్లు అర్జున్ చెలెల్లి పాత్రను నివేతా థామస్ పోషించనుందని వార్తలొచ్చాయి.

దాంతో నిజంగానే నివేతా బన్నీకి చెల్లెలుగా చేస్తుందని అనుకున్నారంతా. అయితే ఆ నోట,ఈ నోట ఈ వార్తను విన్న నివేతాథామస్ ఈ విషయంపై స్పందించింది.ఆ వార్తలో అసలు నిజం లేదని తెలిపింది.అంతేకాకుండా ఈ చిత్రం గురించి ఇప్పటివరకు తనను ఎవరు సంప్రదించలేదని కూడా చెప్పింది. సో ఈ సినిమాలో బన్నీ చెల్లెలు నివేతా కాదన్నమాట.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి