NewsWaves.news

సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న “నిన్ను నమ్మం బాబు” పాట…

ఏపీ సీఎం చంద్రబాబు పై వచ్చిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.అది కూడా బాబుని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ “నిన్ను నమ్మం బాబు”అంటూ ప్రారంభమయ్యే సాంగ్ కావడం విశేషం. చంద్రబాబు నాలుగున్నర సంవత్సరాల పరిపాలన పై,ఆయన చేసిన అబద్ధపు వాగ్దానాలు, ప్రజలను చేసిన మోసం తదితర విషయాలను తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఈ పాటను రూపొందించారు. ఇక ఈ పాట నెటిజన్లకు తెగ నచ్చేసింది.

ఈ పాట లిరిక్స్ లో మధ్యమధ్యలో చంద్రబాబు ప్రసంగాల్లో దొర్లిన తప్పిదాలను,పొరపాట్లను కూడా జోడించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాట చివర్లో చంద్రబాబు కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ “జస్ట్ ట్రైలర్” మాత్రమే అనే డైలాగ్ ని జోడించడం సాంగ్ ట్రైలర్ కి హైలెట్ అయ్యింది. ఈ పాట కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా, జనాలు ఈ పాటని తమ స్టేటస్ లో కూడా పెట్టుకోవడం చూస్తుంటే ఈ సాంగ్ ట్రైలర్ ప్రజలను ఎంతగా ఆకర్షించిందో అర్థమవుతుంది.

Related Articles