NewsWaves.news

కార్తికేయ2 కి రంగం సిధ్దo.

నిఖిల్ స్వాతి హీరోహీరోయిన్లుగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం కార్తికేయ. 2014లో ఈ చిత్రం విడుదలై సంచలన విజయం సాధించింది. అప్పటినుండి ఈ చిత్రానికి సీక్వెల్ సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి .ఇప్పుడు ఈ వార్త నిజం కానుంది.చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరో గా కార్తికేయ-2 పేరుతో ఓ చిత్రం రూపొందనుంది.

ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వనాథ్ ,వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా వెల్లడించారు . జూన్ 1న హీరో నిఖిల్ పుట్టినరోజు జరుపుకొనున్నారు.కార్తికేయ – 2′ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. చిత్రంలోని ఇతర నటీ, నట సాంకేతికవర్గం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాత, దర్శకులు తెలిపారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి