NewsWaves.news

బాబాయ్‌లో గ‌ర్వం లేదు : నిహారిక

కొణిదెల గారి అమ్మాయి నిహారిక అప్పుడ‌ప్పుడు బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి కొత్త కొత్త విష‌యాలు షేర్ చేయ‌డం తెలిసిందే. ఇటీవ‌లే సూర్య‌కాంతం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన నిహారిక‌.. ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడింది. ఈ సంద‌ర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు వెల్ల‌డించింది. “పవన్ బాబాయ్ ఎక్కువగా మాట్లాడడు. .. ఆయన మితభాషి. ఎప్పుడు చూసినా కామ్ గా కనిపించే ఆయన, ఏదైనా ఫంక్షన్ కి వస్తే మాత్రం బాగానే సందడి చేస్తాడు అని తెలిపింది నిహారిక.

ఇక ప‌వ‌న్‌లోని కొంటెత‌నం గురించి మాట్లాడుతూ.. తాము ఏదైనా కొంటె ప‌ని చేస్తే..ఆట‌ప‌ట్టిస్తాడ‌ని.. ఏడిపిస్తాడ‌ని తెలిపాడు. అలాంటి వ్య‌క్తి ఇప్పుడు జనంలోకి వెళ్లి చేసే ప్ర‌సంగాలు వింటే ఆశ్య‌ర్యంగా ఉంద‌ట‌. ప‌వ‌న్ ప్ర‌సంగాలు త‌న‌కు స్ఫూర్తినిస్తాయ‌ని .. అయితే ఈ విషయం ఇంతవరకూ బాబాయ్ కి చెప్ప‌లేద‌ని తెలిపింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి