NewsWaves.news

భారత్ లోకి మెర్సిడెజ్ బెంజ్ కొత్త కారు.

జర్మనీ విలాస కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ బిఎస్6 నిబంధనలకు లోబడి సెడాన్ మోడల్ ఇ క్లాస్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.ధర 57.5 నుండి 60 2.5 లక్షలు గా నిర్ణయించారు.అత్యాధునిక ఇంటీరియర్‌ ఫీచర్లను ఇందులో తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. పెట్రోల్‌ వెర్షన్‌లో అమర్చిన 1991 సీసీ ఇంజిన్‌ 197 హార్స్‌పవర్‌ శక్తి అందిస్తుంది.

పెట్రోల్‌ వేరియంట్ల ధరలు వరుసగా రూ.57.5 లక్షలు, రూ.61.5 లక్షలుగా ఉన్నాయి. ఇక డీజిల్‌ వెర్షన్‌లో అమర్చిన 1950 సీసీ ఇంజిన్‌ 194 హార్స్‌పవర్‌ శక్తి అందిస్తుంది. వీటి ధరలు రూ.58.5 లక్షలు, రూ.62.5 లక్షలుగా ఉన్నాయి. కొత్త కారులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్‌ పైలట్‌, యాక్టివ్‌ పార్కింగ్‌ అసిస్ట్‌, అడాప్టివ్‌ బ్రేక్‌ లైట్లు వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.అత్యాధునిక ఇంటీరియర్‌ ఫీచర్లను ఇందులో తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి