NewsWaves.news

ముందే జాగ్రత్త పడ్డాం… నవీన్ పట్నాయక్…

ఒడిశాను చిగురుటాకుల వణికిస్తుంది ఫణి తుఫాన్. ఈ తుఫాను కారణంగా ఒడిశాలో తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. అయితే ఫణి తుఫాను సృష్టించబోయే ప్రళయాన్ని తాము ముందుగానే గుర్తించామని వెల్లడించారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. తుఫాను రాకముందే రక్షణ చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.

24 గంటల వ్యవధిలోనే 12 లక్షల మందిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించామని తెలిపారు. తుఫాను నుండి ప్రజలని రక్షించడం కొరకు రాత్రికి రాత్రే 9000 షెల్టర్లను నిర్మించామని, అలాగే భోజన సదుపాయం కొరకు 7000 కిచెన్ లను ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈ తుఫాను నుంచి ఒడిషా ప్రజలను కాపాడేందుకు ఏర్పాటుచేసిన ఆపరేషన్ ఫణి కొరకు 45వేల మంది వాలంటీర్లు ఎంతో పని చేశారని ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ ప్రకటించారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి