NewsWaves.news

అంగార‌కుడిపై నాసా రోవ‌ర్ ఖేల్ ఖ‌తం

2003లో అంగార‌క గ్ర‌హంపై నాసా ప్ర‌యోగించిన ఆపర్చునిటీ రోవ‌ర్ క‌థ ముగిసింది. 2018లో మార్స్ పై భారీ ఇసుక తుపాను వ‌చ్చింది. ఇందులో చిక్కుకున్న రోవ‌ర్‌.. అప్ప‌టి నుంచి స‌రిగ్గా ప‌ని చేయ‌డం లేదు. దాదాపు ఎనిమిది నెల‌లుగా అస‌లు క‌ద‌ల‌డం లేద‌ట‌. దీంతో అది డెడ్ అయిన‌ట్టు అమెరికా అంతరిక్ష ప‌రిశోధ‌న సంస్థ అయిన నాసా ప్ర‌క‌టించింది.

అయితే ఈ ఎనిమిది నెల‌ల్లో నెల‌కు వంద సార్లు చొప్పునా.. దాన్ని ప‌ని చేయించ‌డానికి ప్ర‌య‌త్నించార‌ట‌. అయినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో దాని ఖేల్ ఖ‌తం అయిన‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో 15 సంవ‌త్స‌రాల ఆప‌ర్చునిటీ ప్ర‌యాణం ఇంత‌టితో ముగిసింది. 2020లో మ‌రో కొత్త రోవ‌ర్ ను అంగార‌కుడిపై పంప‌నున్నార‌ట‌.

Related Articles