NewsWaves.news

వైసీపీలో చేరిన నార్నె శ్రీనివాసరావు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి…

నార్నే సంస్థల అధిపతి,హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ అయినటువంటి నార్నే శ్రీనివాసరావు వై.ఎస్.ఆర్.సీ.పీ. లో చేరారు.ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ రోజు ఉదయం లోటస్ పాండ్ లోని వైసీపీ కార్యాలయంలో,వైసీపీ కండువా కప్పి శ్రీనివాసరావును పార్టీలోకి ఆహ్వానించారు జగన్.గత కొద్ది రోజుల క్రితమే నార్నే..జగన్ ను కలిశారు.దానితో శ్రీనివాస రావు వైసీపీలో చేరుతారనే వార్త రాజకీయ వర్గాల్లో సందడి చేసింది.అలాగే తాజాగా కాంగ్రెస్ కి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కూడా ఈ రోజు లోటస్ పాండులోని వైసీపీ కార్యాలయంలో వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.ఆమెతో పాటు ధర్మాన సోదరుడు కృష్ణదాస్ కూడా ఉన్నారు. బీసీల అభివృద్ధి కోసం జగన్ చేసిన హామీలు ఒక బీసీ నేతగా తనకు నచ్చాయని, అందుకే వైసీపీలో చేరానని కృపారాణి అధికారికంగా ప్రకటించారు.

Related Articles