NewsWaves.news

నారాయణ మూర్తి సినిమానే పెళ్లి చేసుకున్నాడు:చిరంజీవి

ఎర్రసైన్యం, దండోరా, చీమలదండు ఒరేయ్ రిక్షా వంటి అభ్యుదయ, విప్లవాత్మక చిత్రాలతో చిత్రాలతో పీపుల్ స్టార్ గా ఎదిగిన నటుడు ఆర్.నారాయణమూర్తి . ప్రస్తుతం ఆర్.నారాయణమూర్తి నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం” మార్కెట్లో ప్రజా స్వామ్యo”.ఈ ఆడియో ఫంక్షన్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ”1978లో నేను ‘ప్రాణం ఖరీదు’ సినిమా చేస్తున్నప్పుడు నూతన్‌ ప్రసాద్‌కి పేపర్‌ అందించే అసిస్టెంట్‌ కుర్రాడి పాత్ర చేశాడు తను. అప్పుడే చాలా హుషారుగా, మాట్లాడుతుండటంతో క్యూరియాసిటీతో ఏ ఊరు? అని అడిగితే రాజమండ్రి దగ్గర రావులపాలెం అని చెప్పాడు. ఆరోజు నుంచి ఈరోజు వరకు కూడా మా స్నేహం, అనుబంధం కొనసాగుతోంది. కష్టంతో, దీక్షతో అలుపెరుగని పోరాటం చేసి, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ‘పీపుల్స్‌స్టార్‌’ ఆర్‌.నారాయణమూర్తి అనిపించుకునే కీర్తి సంపాదించుకున్నాడు.

1984 నుంచి ఇప్పటి వరకూ 30 సినిమాలు ఓ నటుడిగా, నిర్మాతగా తను నమ్మిన బాటలో ముందుకు వెళుతూ మనందరి చేత శభాష్‌ అనిపించుకుంటున్నాడంటే అతని కమిట్‌మెంట్‌ అంతా ఇంతా కాదు.సినిమా ప్రాణం.. సినిమాయే నా జీవితం అనుకున్నాడు. సినిమానే ప్రేమించాడు, సినిమానే పెళ్లి చేసుకున్నాడు, సినిమానే తన బిడ్డలుగా అనుకున్నాడు నారాయణమూర్తి’’ అన్నారు చిరంజీవి.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి