NewsWaves.news

చింతమనేని పూర్తి ప్రసంగాన్ని జగన్ మీడియా ఎందుకు చూపించదు? : లోకేష్‌

తెలుగు దేశం పార్టీ- వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఒక‌రినొక‌రు విమ‌ర్శించే ఏ అవ‌కాశం వ‌దులు కోవ‌డం లేదు. ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో వాడివేడి విమ‌ర్శ‌లు మ‌రింత‌గా పెరిగాయి. కోట‌య్య మ‌ర‌ణంపై తెదెపాను వైకాపా అధినేత నిల‌దీసిన విష‌యం తెలిసిందే. దీంతో మిగితా పార్టీలు ఎద్దేవా చేయ‌డం… జాతీయ స్థాయిలో తెదేపాపై ఎన్నో విమ‌ర్శ‌లు రావ‌డం తెలిసిందే. అయితే ఇప్పుడు నారా లోకేష్ కూడా వైకాపాను విమ‌ర్శించే ఏ ఛాన్స్‌ను విడిచిపెట్ట‌డం లేదు. కొంత స‌మ‌యం క్రితం లోకేష్ ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో చింత‌మ‌నేని గురించి వైకాపానున నిల‌దీశాడు.

జగన్ – మోడీ కుల రాజకీయం: కొండవీడులో రైతు కోటయ్య మృతి ఘటనపై ట్వీట్ చేస్తూ, కోటయ్యను ఒక బీసీ(ముత్రాసి) రైతు అని నొక్కి చెప్పారు జగన్. మనిషి ప్రాణానికి కూడా కులాన్ని జత చేయడం జగన్ కే చెల్లింది.

నిజం – చింతమనేని పూర్తి ప్రసంగాన్ని జగన్ మీడియా ఎందుకు చూపించదు? వీడియోలో చింతమనేని మాటలకు వారంతా చప్పట్లు, కేరింతలు కొట్టారు. తమను అవమానిస్తుంటే ఎవరైనా చప్పట్లు, కేరింతలు కొడతారా జగన్ గారు?

పదే పదే కుల ప్రస్తావన తెస్తూ, కులాల చిచ్చుతో ఏపీని అస్థిరపరచాలని చూస్తున్న జగన్ వెనుక, రాష్ట్ర అభివృద్ధిని ఇష్టపడని కెసిఆర్, మోడీల పాత్ర స్పష్టమవుతోంది. తెదేపాను దెబ్బతీసేందుకు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం రాక్షసత్వం. ప్రజలకు మీ కుట్రలు అర్థమైన నాడు మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు.

Related Articles