NewsWaves.news

నాని గ్యాంగ్ లీడర్ విడుదల తేది ఖరారు.

నాని నటించిన జెర్సీ చిత్రం సూపర్ హిట్ కావడంతో తన తర్వాత చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడు. నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. విక్రమ్ కెకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్,రవి శంకర్, మోహన్ నిర్మిస్తున్నారు .అనిరుద్ బాణీలు సమకూరుస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

టైటిల్ లోగో కూడా విడుదల చేశారు. కాగా ఈ చిత్రాన్ని ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ఓ విభిన్నమైన కథ ఇది .ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చేస్తున్నాం. మరో విభిన్న అంశం కూడా ఉంటుంది. అదేంటో తెరపైనే చూడాలి అని అన్నాడు. ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ ,శరణ్య ,ప్రియదర్శి రఘుబాబు, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి