NewsWaves.news

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నాని?

నేచురల్ స్టార్ నాని జెర్సీ చిత్రం తో విజయo తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటిస్తున్నారు. అంతేగాక ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా v చిత్రం లో నటిస్తున్నారు.

నాని తో సినిమా చేయడానికి యువ దర్శకులందరు ఆసక్తి తో ఉన్నారు.నాని తర్వాతి చిత్రం శ్రీకాంత్ అడ్డాల తో ఉంటుందని వార్తలు వస్తున్నాయి.కొత్త బంగారు లోకం వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించి అంద‌రి దృష్టిలో పడ్డారు. ఇక 2016లో మహేశ్‌బాబుతో బ్రహ్మోత్సవం అనే చిత్రం చేశాడు. ఈ సినిమాకి ఆయ‌నకి ఘోర ప‌రాభవం క‌లిగించింది . దీంతో ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్టును ఓకే చేయలేదు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు కొత్త సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు శ్రీకాంత్.

శ్రీకాంత్ చెప్పిన కథ నాని కి నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. కూచిపూడి వారి వీధి అనే టైటిల్ తో ఈ సినిమాని తెర‌కెక్కించాల‌ని వారు భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కించనున్నారట.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి