NewsWaves.news

ప‌వ‌ర్ స్టార్‌కు మద్ధ‌తుగా నాగ‌బాబు కొత్త యూట్యాబ్ ఛాన‌ల్‌

ఈ మ‌ధ్య యూట్యూబ్ ఛాన‌ల్‌లో బాల‌య్య బాబుపై సెటైర్లేస్తూ బాగా బిజీగా గడుపుతున్నారు నాగ‌బాబు. అన్న చిరంజీవి సినిమాలతో బిజీగా ఉన్నాడు.. త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ ప‌నులతో బిజీగా ఉన్నాడు. అదే స‌మ‌యంలో నాగ‌బాబు ఇప్పుడు యూ ట్యూబ్‌, సోషల్ మీడియాపై దృష్టి పెట్టాడు.
మెగా ఫ్యామిలీకి ఏదైనా స‌మ‌స్య వ‌స్తే ముందుగా స్పందించి..ఎవ‌రైనా అనుచితంగా వ్యాఖ్యాలు చేస్తే నాగ‌బాబు ఘాటుగా స్పందిస్తాడు.అయితే ఈ మ‌ధ్య జ‌న‌సేన పార్టీపై ఇత‌ర పార్టీ నేత‌ల విమ‌ర్శ‌లు ఎక్కువ అవ‌డంతో వాళ్ల‌కు రిప్లై ఇవ్వ‌డానికి మై ఛాన‌ల్‌- నా ఇష్టం అనే యూట్యూబ్ ఛాన‌ల్ ను ప్రారంభించాడు. అయితే ఈ ఛానెల్‌కు జ‌న‌సేన పార్టీకి ఎలాంటి సంబంధం లేద‌నీ..త‌న‌కు తానుగా కొత్త ఛాన‌ల్ ఓపెన్ చేసుకున్నాన‌ని తెలిపాడు నాగ‌బాబు.

ఇప్ప‌టికే త‌న అఫీషియల్ ఛాన‌ల్‌లో వీడియోలు షేర్ చేసిన నాగ‌బాబు.. మ‌రి ఈ ఛానెల్‌లో ఎలాంటి కంటెంట్ పెడ‌తాడో చూడాలి మ‌రి.

Related Articles