NewsWaves.news

ఎన్టీఆర్‌ను చంపింది ఆయ‌న కుటుంబస‌భ్యులే : నాదెండ్ల భాస్క‌ర్‌

ఎన్టీఆర్ జీవితం గురించి నాదెండ్ల భాస్క‌ర్‌కు తెలిసిన‌న్ని ర‌హ‌స్యాలు మరెవ‌రికి తెలియ‌వు అంటారు. నిన్న మ‌హాన‌టుడు విడుద‌లైన సంద‌ర్భంగా ఒక టీవీ ఛాన‌ల్‌తో మాట్లాడిన నాదెండ్ల భాస్కర్ ఎన్నో సంచ‌ల‌న విష‌యాలు చెప్పారు. ఎన్టీఆర్ చివరి దశలో, పక్షపాతం వచ్చి బాధపడ్డ సమయంలో 12 మంది సంతానం ఉండి కనీసం మంచి నీళ్లు, ఆహారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు.ఎన్టీఆర్ ను చంపిందే ఆయన కుటుంబసభ్యులు, చంద్రబాబు అని పేర్కొన్నారు.


భోజనం, ఖర్చుల కోసం 25 లక్షలు ఎన్టీఆర్ పక్కన పెట్టుకుంటే.. కోర్టుకు వెళ్లి ఆ డబ్బులు కూడా తీసుకోకుండా స్టే తెచ్చారని గుర్తు చేశారు. కుటుంబసభ్యులు ఆహారం కూడా పెట్టని సమయంలో లక్ష్మీపార్వతి వచ్చి ఎన్టీఆర్ కు చాలా సపర్యలు చేశారని, ఆమె వల్లే ఎన్టీఆర్ ఆరోగ్యం మళ్లీ మెరుగైందన్నారు. చంద్రబాబును ప్రొజెక్ట్ చేయానికే ఈ సినిమా తీశారని, అసలు విలనే చంద్రబాబు అన్నారు. నిజానిజాలు ఏంటో ప్రజలకు తెలుసని, తాను విలన్ నా కాదా అనేది ప్రజలు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.

Related Articles