NewsWaves.news

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు తేదీ ఖరారు

తెలంగాణలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈనెల 22 నుండి మే 14 వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. మరోవైపు ఈసి కూడా ఎన్నికల నిర్వహణకు కొన్నాళ్లుగా తీవ్ర కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ నగరాన్ని మినహాయిస్తే తెలంగాణ జిల్లాలో 535 జడ్పిటిసి 5857 ఎంపీ స్థానాలకు రిజర్వేషన్లను ఇప్పటికే ప్రకటించింది. లోక్ సభ ఎన్నికలు అయిపోగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం సైతం సుముఖత వ్యక్తం చేసింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి