NewsWaves.news

ప్రపంచ తెలుగు మహిళా సభలకు కవిత….

నిజామాబాద్ ఎంపీ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు అరుదైన ఆహ్వానం అందింది. మలేషియాలో జరగనున్న ప్రపంచ తెలుగు మహిళా సభలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలంటూ కవితకు ఆహ్వానం అందింది. మార్చి 2 నుండి మార్చి 4 వరకు కౌలాలంపూర్ లో ఈ ప్రపంచ తెలుగు మహిళా సభల వేడుకలు జరగనున్నాయి.

ఈ కార్యక్రమం నిర్వాహణ కన్వీనర్ వినయ్ కుమార్ ఎంపీ కవిత ను కలిసి ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రావాలంటూ ఆహ్వానించారు. మలేషియా తెలుగు సంఘం, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. కమిటీ ఆహ్వానాన్ని అంగీకరించిన కవిత తాను హాజరవుతానని సభ్యులకు హామీ ఇచ్చినట్లు సమాచారం.



Related Articles