NewsWaves.news

అవయవదానాన్ని పోత్సహించాలి : ఎంపీ కవిత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అవయవదానం కార్యక్రమం ఏర్పాటుచేశారు. హైదరాబాద్, నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈరోజు నుంచి వచ్చే ఏడాది కేసీఆర్ పుట్టినరోజు వరకు ఈ కార్యక్రమం ద్వారా 50వేల మంది అవయవ దానం చేసేలా ప్రోత్సహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించి.. అంగీకార పత్రాలపై ఆమె సంతకాలు చేశారు.

మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీలు బీబీ పాటిల్, సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, గ్లోబల్, సన్‌షైన్ ఆస్పత్రి వైద్యులు రవీంద్రనాథ్‌రెడ్డి, గురవారెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Articles