NewsWaves.news

అభ్యర్థుల్లో సగం మందికి నేర చరిత్ర….

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో పాల్గొననున్న అభ్యర్థులలో సగం మందికి పైగా నేర చరిత్ర కలిగిన వారే అని వెల్లడించింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ. ఆరో విడత లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులలో సగానికి పైగా మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆ సంస్థ ప్రకటించింది.

ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు అఫిడవిట్లను ఈ సంస్థ పరిశీలించింది. కాగా అందులో ఉన్న 967 మంది అభ్యర్థులలో 20 శాతం పైగా మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలియజేసింది.అందులో ప్రధాన పార్టీలైన బిజెపిలో 48 శాతం మంది, ఇక కాంగ్రెస్ పార్టీలో 44 శాతం మంది నేర చరిత్ర కలిగిన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినట్లు ఏడీఆర్ తన రిపోర్టులో వెల్లడించడం గమనార్హం.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి