NewsWaves.news

వర్మ ఎన్టీఆర్‌లో హైలైట్‌గా మోహ‌న్ బాబు పాత్ర‌

వివాదాల రారాజు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఇండ‌స్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి రోజుకో విష‌యంతో వ‌ర్మ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. త్వ‌ర‌లో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైర‌ల్ విడుదల చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌లే వెల్ల‌డించాడు వ‌ర్మ‌. అయితే ఈ మూవీలో ఎన్టీయార్ ఫ్యామిలీ, చంద్ర‌బాబును నెగెటీవ్ గా చూపిస్తాడేమో అని టెన్షన్ ప‌డుతున్నార‌ట అభిమానులు.

గురువారం రోజు ఈ మూవీ ట్రైల‌ర్ విడుదల చేయ‌నున్న‌ట్టు తెలిపిన వ‌ర్మ… ఇందులో తెలుగు సినీ ప‌రిశ్ర‌మకు చెందిన కొంత మందిని చూపించ‌బోతున్న‌ట్టు.. అందులో మోహ‌న్ బాబు కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఎన్టీయార్ తో మోహ‌న్ బాబు బాగా ట‌చ్‌లో ఉండేవార‌ని.. ల‌క్ష్మీ పార్వ‌తితో కూడా మోహ‌న్ బాబు బాగానే ఉండేవార‌ని …అయితే ఎన్టీయార్ మృతిలో వాళ్ల మ‌ధ్య మాట‌లు త‌గ్గిపోయాన‌ని స‌మాచారం.

ఒకానోక స‌మ‌యంలో మోహ‌న్ బాబు దుర్మార్గుడు అని లక్ష్మీ పార్వ‌తి అన్నారు. మ‌రి అలా ఎందుక‌న్నారో.. క‌నీసం ఈసినిమాలో అయినా తెలుస్తుందేమో..చూడాలి మ‌రి.

Related Articles