NewsWaves.news

మోడీకి పరాభవం తప్పదంటున్న మమత…

ఎన్నికల నేపథ్యంలో భారత ప్రధాని మోదీ,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా మోదీ ఒక ఎన్నికల ప్రసంగంలో మమతా పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వాటిపై స్పందించిన మమత మోడీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను గుండా అని మోదీ అనడం పై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఒక దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా అవి అంటూ ఆమె ప్రశ్నించారు.

మోదీకి ఈ ఎన్నికల్లో పరాభవం తప్పదు అని ఆమె వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లో లో బిజెపికి 17 సీట్లు కూడా రావని తెలిపిన మమత… ఇక కేంద్రంలో ఆ పార్టీకి ఇంకో అవకాశం ఏ విధంగా లభిస్తుందని అన్నారు. మోదీది అహంకార ధోరణి అని,ఆయన పాలన అవినీతిమయం అని ఆమె ఆరోపించారు. అటువంటి పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమయ్యిందంటూ మమత ధ్వజమెత్తారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి