NewsWaves.news

జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్..యుద్ధం జరుగుతున్నట్లుగా భావించాల్సి ఉంటుంది.. మోడీ

పాక్ సైన్యం అదుపులో ఉన్న భారత పైలెట్ అభినందన్ ను 7రోజుల్లో గా భారత్ కు అప్పగించాలని,లేదంటే పాక్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, అంతేకాకుండా యుద్ధం జరుగుతున్నట్లుగా భావించాల్సి ఉంటుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు. అంతేకాదు ఇప్పటికే జెనీవా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని మోడీ అన్నారు.

జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీల ఫొటోలను, వీడియోలను బయట పెట్టకూడదని, యుద్ధ ఖైదీలను హింసించకూడదని మోడీ తన ట్విట్టర్ పోస్ట్ లో తెలిపారు. అంతేకాకుండా జెనీవా ఒప్పందం ప్రకారం బందీ కాబడిన వ్యక్తి యొక్క పేరు, క్యాడర్ మాత్రమే తెలుసుకోవచ్చును అని, అంతే కానీ ఆ దేశ రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం కూడా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది అని.. ఇలా పాక్ చాలా రకాలుగా జెనీవా ఒప్పందం లో ఉన్న అనేక విషయాలను ఇప్పటికే ఉల్లంఘించిందని, ఇప్పటికైనా అభినందన్ ని 7రోజుల్లోగా క్షేమంగా భారత్ కి అప్పగించాలని మోడీ పాక్ ని హెచ్చరించారు.

Related Articles