NewsWaves.news

రైతుల కోసం మోడీ కేబినెట్ తొలి నిర్ణయం…

ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో నేడు కొత్తగా ఎంపికైన క్యాబినెట్ మొదటిసారిగా సమావేశమైంది. తొలి సారి సమావేశమైన కొత్త కేబినెట్‌ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రైతులందరికీ ప్రధాన మంత్రి కిసాన్‌ పెన్షన్‌ యోజన పథకం అమలు అయ్యేలా నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకనుండి అదనంగా రెండు కోట్ల మంది రైతులకు ఈ పథకం కింద పెన్షన్‌ లభించే అవకాశం కలగనుంది. కేబినెట్‌ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 14.5కోట్లకు చేరుతుంది.గడిచిన సంవత్సరంలో ఈ పథకానికి రూ.75వేల కోట్లు ఖర్చయింది. కాగా ఇక నుండి 13 వేల కోట్లు అదనంగా ఖర్చు కానుంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి