NewsWaves.news

తెలంగాణ‌లో రేపు వ‌ర్ష సూచ‌న‌

వాతావ‌ర‌ణ శాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం ఈ రేపు తెలంగాణ‌లోని కొన్ని ప్రాంతాల్లో వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంది. వాయ‌వ్య తెలంగాణ‌లోని కొన్ని ప్రాంత‌ల్లో, నైరుతి తెలంగాణ‌లో మ‌రి కొన్ని ప్రాంతాల్లో క్యూములో నింబ‌స్ మేఘాల వల్ల ఈ వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయ‌ట‌. అదే స‌మ‌యంలో తెలంగాణ‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయాయి. సోమ‌వారం రోజు మెద‌క్‌లో క‌నిష్ఠం 13 కాగా, అదిలాబాద్‌లో 16 డిగ్రీస్ కి ప‌డిపోయింది. నిజామాబాద్‌, రామ‌గుండం, హ‌కీంపేట‌లో 19 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి.

Related Articles