NewsWaves.news

ఎమ్మెల్యే హరిప్రియ దీక్ష

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ దీక్ష చేపట్టారు. ఈ దీక్ష 36 గంటలపాటు కొనసాగుతుంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలని అప్పటి వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఎమ్మెల్యే హరిప్రియ స్పష్టం చేశారు.

బయ్యారంలో స్టీల్ ప్లాంట్ కు అనుకూలంగా నివేదికలు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ఆమె ప్రశ్నించారు.
బయ్యారంలో ఉక్కు పరిశ్రమలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ఇలా కుంటిసాకులు చెబుతోందని హరిప్రియ ధ్వజమెత్తారు.

హరిప్రియ దీక్షకు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు హాజరయ్యారు.

Related Articles