NewsWaves.news

చిన్న‌మేడారం జాత‌ర షురూ

స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ చిన్న జాత‌ర‌- మినీ మేడారం షూరూ అయింది. ములుగు జిల్లా తాడ్వాయి మండ‌ల మేడారంలో ఈ జాత‌ర నాలుగు రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. ఈ రోజు ఉద‌యం మండెమెలిగే వేడుక‌తో ఈ జాత‌ర ప్రారంభ‌మైంది. ఉద‌యమే స‌మ్మ‌క్క- సార‌ల‌మ్మ గ‌ద్దెల వ‌ద్ద పూజారులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

ములుగు జిల్లా ఏర్ప‌డిన త‌ర్వాత జ‌రుగుతోన్న తొలి జాత‌ర కావ‌డంతో వివిధ జిల్లాల నుంచి భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు. జంప‌న్నవాగులో పుణ్య‌స్నానాలు ఆచ‌రించి త‌ల‌నీలాలు స‌మ‌ర్పిస్తున్నారు .

అనంత‌రం అమ్మ‌వార్ల గ‌ద్దెల వ‌ద్ద‌కు చేరుకుని వెంట తీసుకొచ్చిన బంగారం ( బెల్లం) స‌మ‌ర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా క‌లెక్ట‌ర్ వాసం వెంక‌టేశ్వ‌ర్లు అమ్మ‌వారిని ద‌ర్శించుకుని నిలువెత్తు బంగారం స‌మ‌ర్పించి అమ్మ‌వారికి చీర‌సారేల‌ను అందించారు.

Related Articles