NewsWaves.news

ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థిని ఇత‌నే…

ఎంఐఎం పార్టీ త‌న ఎమ్మెల్సీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు పార్టీ అధ్య‌క్షుడు అసదుద్దీన్ ఓవైసీ సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న చేశారు. ఎమ్మెల్యే కోటా అభ్య‌ర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హ‌స‌న్‌ను ఎంపిక చేసినందుకు ఆనందంగా ఉంద‌ని ఓవైసీ ట్వీట్ చేశారు. మీర్జా రియాజ్ ప్ర‌స్తుతం డబీర్ పూరా కార్పోరేట‌ర్‌గా ఉన్నారు.

mim mlc candiate

వ‌చ్చేనెల 12న జ‌ర‌గ‌బోయే ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఇప్ప‌టికే నాలుగు స్థానాల‌కు టీఆర్ ఎస్ త‌మ అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసింది. మ‌రో స్థానాన్ని ఎంఐఎంకు కేటాయించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్, ఎగ్గే మల్లేశం, శేరి సుభాష్‌రెడ్డిని కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

Related Articles