NewsWaves.news

జమ్మూలో కూలిన మిగ్ యుద్ధ విమానం

భార‌తీయ వాయుసేనకు చెందిన మిగ్ విమానం క‌శ్మీర్‌లో కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు పైల‌ట్లు మ‌ర‌ణించారు. సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్త‌డం వ‌ల్లే స‌మీపంలోని బుద్గాంలో ఈ విమానం కూలిన‌ట్టు అధికారులు తెలిపారు. రెగ్యుల‌ర్‌గా జ‌రిగే సైనిక విన్యాసాల్లో భాగంగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌న్నారు. అయితే యుద్ధ సన్నాహక చర్యల్లో భాగంగా ఈ ప్రమాదం జరిగిందా అనే దానిపై స్పష్టత లేదు. అయితే మిగ్ విమానం కూలిన ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఉన్న‌తాధికారులు ఇప్ప‌టికే విచార‌ణ‌కు ఆదేశించారు.

Related Articles