NewsWaves.news

వందేళ్ల త‌రువాత మళ్లీ క‌నిపించిన బ్లాక్ పాంథ‌ర్‌

సుమారు వంద సంవ‌త్స‌రాల త‌రువాత అరుదైన బ్లాక్ పాంథ‌ర్ మ‌నిషి కంటికి చిక్కింది. ఆఫ్రికాలోని కెన్యా దేశంలో శాండిగో జూలో ఏర్పాటు చేసిన ర‌హ‌స్య కెమ‌రాల్లో ఈ న‌ల్ల చిరుత క‌నిపించింది. ఈ కెమెరాలో చిక్కిన ఫోటోను ప‌రిశీలించిన నిపుణులు ఇది బ్లాక్ పాంథ‌రే అని నిర్ధారించారు.

చిరుత‌ల‌పై కొన్ని సంవ‌త్సరాలుగా ప‌రిశోధ‌న చేస్తున్న రీసెర్చ‌ర్లు లోయవ‌ వ‌న్య ప్రాణి సంర‌క్ష‌ణ కేంద్రంలో ప‌లుచోట్ల కెమెరాలు ఏర్పాటు చేశారు. దాంతో ఈ న‌ల్ల చిరుత విష‌యం ప్ర‌పంచానికి తెలిసింది. ఈ జాతి చిరుత‌ల‌ను మెలానిస్టిక్ లెపర్డ్స్ అంటారు. జ‌న్యు ప‌రంగా శ‌రీరంలో మెలానిన్ ఉత్ప‌త్తి కావ‌డంతో చర్మం న‌ల్ల‌బ‌డే ప్రక్రియ‌ను మెలానిజం అంటారు.

Related Articles