NewsWaves.news

అప్పుడే మూడేళ్ల‌యిందా..?? : ఇన్‌స్టాలో మెహ్రీన్ పిర్జాదా

ఎఫ్‌2 విజ‌యంతో మంచి ఊపులో ఉన్న మోహ్రీన్ పిర్జాదా.. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో బాగా యాక్టీవ్‌గా ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. అయితే ఈ రోజు మెహ్రీన్ జీవితంలో ఒక ప్ర‌త్యేక రోజు అంటా.. మ‌రి ఆ స్పెష‌ల్ డే ఏంట‌బ్బా.. కొంప‌దీసి పెళ్లా ఏంటి అని ఖంగారు ప‌డిపోకండి. విష‌యం అది కాదు. మూడేళ్ల క్రితం ఇదే రోజు సినీప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టింద‌ట ఈ బొద్దుగుమ్మ‌. నాని హీరోగా వ‌చ్చిన కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ సినిమాతో తెరంగేట్రం చేసింది మెహ్రీన్‌. ఈ సంద‌ర్భంగా త‌న‌ను ఇంత‌గా అభిమానించిన అభిమానుల‌కు థ్యాంక్స్ చెబుతూ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌పెట్టించి ఈ బ్యూటీ.

మూడేళ్ల‌లో మెహ్రీన్ మొత్తం 11 సినిమాలు చేసింది. ఇందులో ఏదీ హిట్టో ఏది ఫ‌ట్టో తెలుసుకునే ముందు.. ఈ రోజు ఇన్‌స్టాలో మెహ్రీన్ పోస్ట్ చూడండి

కొన్ని హిట్లు..కొన్ని ఫ‌ట్లు…మ‌రికొన్ని ఔట్లు

కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ (2016 )

కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ సినిమాతో తెరంగేట్రం చేసిన మెహ్రీన్ కెరీర్ రెండు హిట్లు నాలుగు ఫ్లాపులు అన్న‌ట్టుగా సాగింది. అయినా త‌న అందంతో ఫ్లాపుల‌ను కూడా క‌వ‌ర్ చేసింది ఈ అమ్మ‌డు. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ హిట్ అవడంతో హీరోయిన్‌గా మంచి అవ‌కాశాలు రావ‌డం మొద‌ల‌య్యాయి.

ఫిల్లౌరీ (2017)

మెహ్రీన్ రెండో సినిమా ఇది. హిందీలో విడుద‌లైన ఈ మూవీ మంచి విజ‌యాన్ని సాధించింది. నిర్మాత‌ల‌కు లాభాన్ని తెచ్చిపెట్టింది.

మ‌హానుభావుడు (2017)

శ‌ర్వానంద్ హీరోగా వ‌చ్చిన ఈ మూవీ యావరేజ్ టాక్ సంపాదించుకుంది. దీంతో హ్యాట్రిక్ కొడుతుంది అనుకున్న మెహ్రీన్‌కు డిస‌పాయింట్‌మెంట్ మాత్ర‌మే మిగిలింది.

రాజా ది గ్రేట్ (2017)

మాస్ మ‌హారాజా హీరోగా వ‌చ్చిన ఈ మూవీలో మెహ్రీన్ న‌ట‌న ప‌రంగా మంచి మార్కులు సంపాదించుకుంది. మొత్తం సినిమా అంతా ర‌వితేజ డామినేట్ చేసినా.. మెహ్రీన్ త‌న న‌ట‌న‌తో మెప్పించింది.

కేరాఫ్ సూర్య (2017)

ఈ మూవీతో మెహ్రీన్ ఫ్లాపుల ప్ర‌స్థానం మొద‌లైంది. ఈ మూవీలో సందీప్ కిష‌న్‌, విక్రాంత్ హీరోగా న‌టించారు.

జ‌వాన్ (2017)

ఈ మూవీ ఎప్పుడొచ్చిందో.. ఎప్పుడు వెళ్లిపోయిందో అనేది చాలా మందికి గుర్తే లేదు. సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన ఈ మూవీతో మెహ్రీన్ ఖాతాలో మ‌రో ఫ్లాప్ వ‌చ్చి ప‌డింది.

పంతం (2018)

గోపీచంద్ హీరోగా వ‌చ్చిన ఈ మూవీ ఫ‌ర్వాలేద‌నిపించింది. వ‌రుస ఫ్లాపుల‌తో ఉన్న మెహ్రీన్‌కు ఈ మూవీ కాస్త రిలీఫ్ ను ఇచ్చింది.

నోట‌(2018)

విజ‌య్ దేవ‌రకొండ మంచి ఫామ్‌లో ఉన్న స‌మ‌యంలో వ‌చ్చిన ఈ మూవీలో మెహ్రీన్ ఎక్క‌డ ఉందో అని భూత‌ద్దం వేసి వెతికినా క‌నిపించదు. పాపం మ‌రో ఫ్లాప్.

క‌వ‌చం(2018 )

బెల్లంకొండ శ్రీనివాస్ న‌టించిన ఈ మూవీతో మ‌రో ఫ్లాప్ మూట‌గ‌ట్టుకుంది మెహ్రిన్‌.

ఎఫ్‌2

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న మెహ్రీన్ కెరీర్‌ను మ‌ళ్లీ గాడిలో పెట్ట‌డానికి వ‌చ్చింది ఎఫ్‌2 సినిమా. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా వంటి బిగ్ స్టార్స్‌తో హిట్ డైర‌క్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించి ఈ మూవీ సంక్రాంతి బ‌రిలో దిగి భారీ విజ‌యాన్ని కైవ‌సం చేసుకుంది. ఈ సంవ‌త్స‌రం మొద‌టి హిట్ ఈ సినిమానే కావ‌డం విశేషం.

Related Articles