NewsWaves.news

మెగా హీరోతో మేఘా ఆకాశ్‌

లై సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన మేఘా ఆకాశ్‌కు ఇప్ప‌టి దాకా ఒక్క హిట్ సినిమా ప‌డ‌లేదు. లై త‌రువాత నితిన్‌తో చ‌ల్‌మోహ‌న రంగా సినిమా చేసినా మ‌ళ్లీ వైఫ‌ల్య‌మే ఎదురైంది. త‌మిళ సినిమాలు చేసినా అదే ప‌రిస్థితి. అయినా ఈ అమ్మ‌డుకు ఆఫ‌ర్లు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.

తాజాగా సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరో గా సుకుమార్ తెర‌కెక్కిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందట మేఘ‌.

ఇప్ప‌టికే ఎన్నారై అమ్మాయి మ‌నీషా రాజ్ లీడ్ రోల్‌లో ఎంపిక చేశారు.

అయితే ఇప్పుడు మేఘా ను ఎంచుకొని మ‌నీషాను ప‌క్క‌నపెట్ట‌నున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇద్ద‌రు హీరోయిన్లు కూడా ఉండే అవ‌కాశం లేక‌పోలేదు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి