NewsWaves.news

త‌మిళ అర్జున్‌రెడ్డి హీరోయిన్ మారింది

తెలుగులో ట్రెండ్ సెట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమా త‌మిళంలో డ‌బ్ అవుత‌న్న విష‌యం తెలిసిందే. ఈ మూవీకి వ‌ర్మ అనై టైటిల్ ఫిక్స్ చేశారు. విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ ఈమూవీలో హీరోగా న‌టిస్తున్నాడు. ఇందులో మేఘ చౌద‌రీ హీరోయిన్‌గా న‌టించగా.. బాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అయితే సినిమా షూటింగ్ చాలా శాతం పూర్త‌య్యాక‌.. ఔట్ పుట్ న‌చ్చ‌క‌పోవ‌డంతో నిర్మాత‌లు మొత్తం సినిమా మ‌ళ్లీ తీయాలి అని నిర్ణ‌యించారు.

దీంతో హర్ట్ అయిన బాల ద‌ర్శ‌కుడిగా డ్రాప్ అయ్యాడు. వ‌ర్మ‌ని మ‌ళ్లీ రీ షూట్ చేస్తామ‌ని నిర్మాత‌లు ఇప్ప‌టికే ప్ర‌కటించారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ మూవీకి బాలీవుడ్ హీరోయిన్ భ‌ణిత సంధు ధృవ్ క‌థానాయిక‌గా ఫిక్స్ అయింది. అయితే ఈ మూవీకి ద‌ర్శ‌కుడు ఎవ‌రో అనేది ఇంకా ఫైన‌ల్ అవ్వ‌లేదు.

Related Articles