NewsWaves.news

ప్రధాని గంగలో మునిగితే పాపాలు పోతాయా… మాయావతి

భారత ప్రధాని మోదీ నిన్న కుంభమేళా సందర్భంగా యూపీలోని ప్రయాగ్ రాజ్ లో పవిత్ర గంగానదిలో స్నానమాచరించి, హారతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు బీఎస్పీ అధినేత్రి మాయావతి.

ప్రధాని మోదీ ముందుగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అంతేకానీ పాపాలు చేసి గంగలో మునిగితే చేసిన పాపాలు పోతాయా అని ఎద్దేవా చేశారు. జిఎస్టి,పెద్ద నోట్ల రద్దు… ఇలా అనేక విషయాలలో మోదీ పాపాలు చేశారని ఆమె విమర్శించారు.

ఇక మోడీ ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ వల్ల రైతులకు నెలకు 500 రూపాయలు మాత్రమే వస్తున్నాయని, అవి రైతుకు ఎలా ఉపయోగపడతాయో ప్రధానే చెప్పాలని ప్రశ్నించారు మాయావతి.ఇన్ని పాపాలు చేసిన మోడీ గంగలో మునిగినంత మాత్రాన సరిపోదని,శిక్ష అనుభవించాల్సిందే అని మాయావతి తీవ్రస్థాయిలో విమర్శించారు.

Related Articles