NewsWaves.news

వారమంతా నష్టాలే

ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్లు వారమంతా చుక్కలు చూపించాయి. వరుసగా ఏడో రోజు కూడా దేశీయ మార్కెట్ సూచీలు నష్టాలను చవిచూశాయి. ఫలితంగా ముదుపర్లు ఈ వారంలో నష్టాలనే మూటగట్టుకున్నారు. ఈ రోజు లోహ, ఫార్మా, ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోను కావడంతో సూచీలు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్‌ 67 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 21 పాయింట్ల నష్టాన్ని చవి చూసింది.
ఉదయం మందకొడిగా ప్రారంభమైన సూచీలు కొంతసేపట్లోనే 115 పాయింట్లకు పైగా నష్టపోయింది. కీలకమైన రంగాలు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఆ ప్రభావం మార్కెట్లపై స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనపడింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 67 పాయింట్లు నష్టపోయి 35,809 పాయింట్ల వద్ద, నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయి 10,724 వద్ద స్థిరపడ్డాయి.

Related Articles