NewsWaves.news

మావోల మెరుపుదాడి…ఎమ్మెల్యే స‌హా ఆరుగురు మృతి

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి   విరుచుకుప‌డ్డారు.  దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి ల‌క్ష్యంగా ఆయ‌న  కాన్వాయ్‌పై  మావోయిస్టులు  దాడి చేశారు. ఈ దాడిలో  ఐదుగురు పోలీసులు మృతిచెందారు. కౌకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్యామ్‌గిరిలో ఈ దాడి జరిగింది. ఐఈడీ పేలడంతో కాన్వాయ్‌లోని వాహనం తునాతునకలైంది.

Source : ANI (Twitter )

ఈ స‌మాచారం అంద‌గానే సీఆర్పీఎఫ్ బలగాలు అక్కడికి చేరుకుని గాలింపు చేప‌ట్టాయి.  కాన్వాయ్‌లో  చివరి వాహనంలో  ఎమ్మెల్యే  ఉన్నట్లు తెలిసింది. ఈ దాడిలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాంధ‌వి అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఎదురుకాల్పులు జ‌రుగుతున్నాయి..  ఐఈడీని పేల్చిన వెంటనే మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. అక్క‌డ‌ కాల్పులు  కొనసాగుతున్నాయి. చత్తీస్‌గఢ్‌లో ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి