NewsWaves.news

మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

మహబూబ్‌నగర్  జిల్లాలో   ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన‌ మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘ‌నంగా   ప్రారంభమ‌య్యాయి. వారంరోజుల‌పాటు ఈ ఉత్స‌వాలు జ‌రుగుతాయి.విశేష వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు. 19వ తేదీన జ‌రిగే గ‌రుడ‌వాహ‌న‌సేవ‌, ర‌ధోత్స‌వానికి  భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌స్తారు.

ఉత్స‌వాల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ఎటువంటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.   మన్యంకొండ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్టీసీ అధికారులు వారం రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడపుతున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ , నారాయ‌ణ డిపోల‌ నుంచి మన్యంకొండ స్టేజీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతారు. 

Related Articles