NewsWaves.news

బీజేపీకి ఆ రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా దక్కదు అంటున్న మమతా బెనర్జీ…

ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి వరకు ప్రధాన పార్టీల నేతలు ఆయా పార్టీల పై విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలోనే 440 ఓల్టుల విద్యుత్ అంత ప్రమాదకరమయ్యింది బీజేపీ పార్టీ అంటూ ఆ పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి పార్టీకి 80 స్థానాలు కూడా దక్కవని ఆమె వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్,కేరళ,పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలలో అయితే కమలం పార్టీ ఒక్క సీటును కూడా దక్కించుకోదని ఆమె జోస్యం చెప్పారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బిజెపి పార్టీకి పడవలసిన ఓట్లు చీలిపోతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి