NewsWaves.news

రాజీవ్ గాంధీ పై మోదీ వ్యాఖ్యలను ఖండిస్తున్నా… మమత బెనర్జీ

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పై మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మోదీ రాజీవ్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమైనవని ఆమె అన్నారు. మాతృభూమి కోసం తన జీవితాన్ని అంకితం చేసి, దేశం కోసం నేలకొరిగిన మహోన్నతమైన వ్యక్తి రాజీవ్ గాంధీ అని, అటువంటి వ్యక్తి పైన మోడీ ప్రయోగించిన భాషను తాను వ్యతిరేకిస్తున్నానని మమతా బెనర్జీ అన్నారు.

కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా..రాజీవ్ గాంధీ తన జీవితాన్ని నెంబర్ వన్ అవినీతిపరుడిగా ముగించుకున్నారు అని మోడీ విమర్శించారు. ఈ వ్యాఖ్యలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వారు కూడా తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి