NewsWaves.news

ఉబర్ లో మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలు

ప్రముఖ క్యాబ్ సర్వీస్ దిగ్గజం ఉబర్ లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నామని ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అధికారికంగా ప్రకటించింది. ఉబర్ తో కలిసి దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మహేంద్ర ప్రకటించింది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ను పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ క్రమంలోనే ఉబర్ తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నామని మహేంద్ర ఎలక్ట్రిక్ సీఈవో మహేష్ తెలిపారు.

ఒప్పందంలో భాగంగా మొదట హైదరాబాద్ లో మహీంద్ర ఈ2ఓ ప్లస్‌ హ్యాచ్‌బ్యాక్‌, మహీంద్ర వెరిటో సెడాన్‌ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతామని, వీటి అవసరాల కోసం నగరంలో పబ్లిక్, ప్రైవేట్ సంస్థలతో కలిసి 30 ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి