NewsWaves.news

హైద‌రాబాద్‌లో మ‌హేష్ మైన‌పు బొమ్మ‌

ప్ర‌ముఖ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మ‌హేష్ బాబు మైన‌పు బొమ్మను త‌యారుచేస్తున్న విష‌యం తెలిసిందే. సింగాపూర్ మ్యూజియం త‌యారు చేస్తున్న‌ ఈ వ్యాక్స్ ప్టాట్యూను ఈ నెల 25న హైద‌రాబాద్‌లో ఆవిష్క‌రించ‌నున్నారు. మ‌హేష్ బాబు సొంతంగా ప్రారంభించిన ఏఎంబీ మ‌ల్టిప్లెక్స్‌లో ప్ర‌ద‌ర్శించినున్నారు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ అభిమానులు ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవ‌చ్చు.

మేడం టుస్సాడ్స్‌కు అంత‌ర్జాతీయంగా 23 బ్రాంచిలున్నాయి. ఇందులో ద‌క్షిణాసియాకు సంబంధించిన ప్ర‌ముఖుల మైన‌పు బొమ్మ‌ల‌ను సింగాపూర్ మ్యూజిమం త‌యారు చేసి ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచుతుంది. భార‌త‌దేశ ప్ర‌ముఖుల మైన‌పు బొమ్మ‌లు త‌యారు చేసి అభిమానుల‌ను అల‌రించ‌డ‌మే త‌మ ల‌క్ష్యం అని తెలిపారు సింగాపూర్ మ్యూజియం నిర్వాహ‌కులు.

Related Articles