NewsWaves.news

మ‌రో చిక్కులో మ‌హేష్ బాబు

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబు సొంతంగా హైద‌రాబాద్‌లో ఏయంబి సినిమాస్ అనే మల్టిప్లెక్స్ ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. కొత్త టెక్నాల‌జీతో, మోడ్రేన్ ఫెసిలిటీస్‌తో నిర్మించిన ఈ థీయేట‌ర్ లో సినిమా చూడాలంటే ప్రేక్ష‌కులు జేబులు ఖాలీ అయిపోతున్నాయ‌ట‌. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌లే జీఎస్టీ నిబంధ‌న‌లు ఉల్లంఘించిద‌ని ఈ మ‌ల్టిప్లెక్స్ కు అధికారులు నోటీసులు పంపించారు..

కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే రూ.100 కు పైగా ధ‌ర ఉన్న టికెట్ పై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి త‌గ్గించింది. ఈ సంవ‌త్స‌రం ఆరంభం నుంచే ఈ కొత్త రేట్లు అమలులోకి వ‌చ్చినా.. ఏయంబి సినిమాస్ మాత్రం ఇంకా రేట్లు త‌గ్గించ‌కుండా పాత‌రేట్ల‌నే కొన‌సాగిస్తుంద‌ట‌. దీంతో రంగారెడ్డి జిల్లా జీఎస్టీ క‌మిష‌న‌రేట్ యాంటి ప్రాఫిటీరింగ్ వింగ్ అధికారులు నోటీసుల జారీ చేశారు.

Related Articles