NewsWaves.news

మ‌హానాయ‌కుడు రివ్యూ

తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో సుస్థిర స్థానం సంపాందించుకున్న విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌బౌముడు, దివంగ‌త ముఖ్యమంత్రి స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత కథ ఆధారంగా తెర‌కెక్కిన మూవీ మ‌హానాయ‌కుడు. నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తూ నిర్మించిన చిత్రం ఈ రోజు విడుద‌లైంది. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ..ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా వ‌చ్చిన ఈ మూవీ ఎలా ఉందో చ‌ద‌వండి.

  • కాస్టింగ్ : న‌ంద‌మూరి బాలకృష్ణ , విద్యాబాలన్, రానా, కళ్యాణ్ రామ్, వెన్నల కిషోర్
  • డైర‌క్ష‌న్ : క్రిష్ జాగర్లమూడి
  • ప్రొడ్యూస‌ర్‌ : నందమూరి బాలకృష్ణ, వసుంధరాదేవి
  • మ్యూజిక్‌ : కీరవాణి
  • సినిమాటోగ్రఫర్ : జ్ఙానశేఖర్
  • ఎడిటర్ : రామకృష్ణ

సినిమా క‌థ :

తెలుగు దేశం పార్టీ స్థాపించిన 9 నెల‌ల్లోనే ముఖ్య‌మంత్రి అవుతారు ఎన్టీఆర్‌. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట‌లు నిల‌బెట్టాల‌ని వ‌రుస‌గా ఎన్నో మంచిప‌నులు చేస్తుంటారు. అయితే రాజ‌కీయంలో నాయ‌కుడి చుట్టూ ఎంతో మంది స్వార్థ‌పరులు చేరిన‌ట్టు.. ఎన్టీఆర్ చుట్టూ కూడా స్వార్థ‌ప‌రులు చేరుతారు. వాళ్ల‌కు కేంద్రం నుంచి స‌హాయం దొర‌క‌డంతో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి ప‌ద‌వి నుంచి దింపేస్తారు. త‌ర్వాత ఎన్టీఆర్ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి ఎలా అయ్యారు..త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలేంటో.. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..

పాజిటీవ్స్

∎నంద‌మూరి బాల‌కృష్ణ న‌ట‌న‌
∎ఎమోష‌న‌ల్ సీన్స్‌లో బాల‌కృష్ణ పెర్ఫార్మెన్స్‌
∎ బ‌స‌వ‌తార‌కంగా విద్యాబాల‌న్ న‌ట‌న‌
∎ మిగితా న‌టీన‌టులు పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.
∎క్రిష్ డైర‌క్ష‌న్‌

నెగెటీవ్స్‌

∎ స్క్రీన్ ప్లే స్లో గా ఉంది.
∎ చంద్ర‌బాబు రోల్ సినిమాటిక్‌గా ఉంది.
∎ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ లేవు

Related Articles