NewsWaves.news

ఈక్వడార్‌లో భారీ భూకంపం

ఈక్వ‌డార్‌లో ఈ రోజు ఉద‌యం భారీ భూకంపం వ‌చ్చింది. పెరూ- ఈక్వ‌డార్ బార్డ‌ర్‌ గుండా ఉండే ప్రాంతంలో భూమి కంపింంచింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్ర‌త 7.7 గా న‌మోదైంది. భూకంప కేంద్రం బార్డ‌ర్ వ‌ద్ద ఉండ‌టంతో ఇటు పెరూ- ఆటు ఈక్వ‌డార్ రెండు దేశాలపై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. ఈ భూకంప ప్ర‌భావం ఆమెరికాలో కూడా క‌నిపించింది.

తెల్ల‌వారు జామునే భూమి కంపించ‌డంతో ప్ర‌జ‌లు ఒక్క సారిగా భ‌యాందోళ‌న‌తో ఇళ్ల నుంచి బ‌య‌టికి వ‌చ్చేశారు. ఈక్వడార్‌లో భూకంపం వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే భూకంపం ధాటికి జరిగిన నష్టం పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

Related Articles